Commentator Akash Chopra backs Chatheswar Pujara and Ajinkya Rahane | Oneindia Telugu

2021-06-28 132

Commentator Akash Chopra backs Chatheswar Pujara and Ajinkya Rahane.
#Teamindia
#ViratKohli
#RohitSharma
#AjinkyaRahane
#Rishabhpant
#Pujara

దూకుడుగా ఆడితేనే సరైన ఇంటెంట్ ఉన్నట్లు కాదని టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. భారత జట్టులో రిషభ్ పంత్, చతేశ్వర్ పుజారా భిన్నమైన ఆటగాళ్లని, ఒకరు దూకుడుగా ఆడితే.. మరొకరు డిఫెన్స్ చేస్తారన్నాడు. కానీ ఈ ఇద్దరు జట్టు‌కు అవసరమేనన్నాడు. ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. ఈ ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. కొందరు ఆటగాళ్లు పరుగులు చేసేందుకు అవసరమైన తీవ్రతను ప్రదర్శించలేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. భిన్నమైన పరిస్థితుల్లో సరైన వైఖరితో ఆడగలిగే ఆటగాళ్లను ఎంపిక చేస్తామని, పరిమిత ఓవర్ల మాదిరి బెస్ట్ టీమ్‌ను సిద్దం చేస్తామన్నాడు.